Mother's Day 2022: Megastar Chiranjeevi's Share Beautiful Video for Mom on Mother's Day, Video Viral - Sakshi
Sakshi News home page

Mother's Day: అమ్మతో మెగా బ్రదర్స్‌.. వీడియో వైరల్‌

Published Sun, May 8 2022 4:45 PM | Last Updated on Sun, May 8 2022 5:00 PM

Mothers Day 2022: Megastar Chiranjeevi Shares Special Video, Goes Viral - Sakshi

మ‌ద‌ర్స్ డే (మే 8) సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రపంచంలోని తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో ఓ పాత వీడియోని షేర్‌ చేశాడు. అందులో తన తల్లి అంజనాదేవితో పాటు సోదరులు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఆ వీడియో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్‌ ఫాదర్‌ సినిమా షూటింగ్‌ అప్పటిది. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ షూటింగ్‌ కూడా అక్కడే జరుతుంది.

(చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్‌)

దీంతో నాగబాబు, అంజనాదేవిలు షూటింగ్‌ లోకేషన్‌కు వచ్చారు. అందరు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత తల్లిని దగ్గర ఉండి కారు ఎక్కించారు. ఈ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘అమ్మలందరికీ అభివందనములు’ అని చిరంజీవి కామెంట్‌ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement