మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలసిందే. సోమవారం బ్రదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్‌తో దిగిన ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తోడబుట్టిన బ్రదర్స్‌కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్‌కి హ్యాపీ బ్రదర్స్ డే’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఫోటోలో పవన్ కల్యాణ్‌ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చిరు పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ ఫోటోకు వేలల్లో లైకులు కురిపిస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P
Comments
Please login to add a commentAdd a comment