'పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం' | If Pawan Kalyan joins TDP, We Welcome: Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

'పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం'

Published Tue, Oct 22 2013 2:03 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం' - Sakshi

'పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం'

అవినీతి పరులు తప్ప మంచి వ్యక్తులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: అవినీతి పరులు తప్ప మంచి వ్యక్తులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంచి వ్యక్తులు ప్రజాజీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచివాడనే పేరుందని తెలిపారు. పది మందికి సాయం చేసే గుణం ఉందని విన్నట్టు చెప్పారు. టీడీపీలోకి దారి ఉందో, లేదో పవన్ కళ్యాణ్నే అడగాలని అన్నారు.

పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు కూడా అన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పోరాడేందుకు టీడీపీ సరైన వేదిక అని పేర్కొన్నారు. మెగా బ్రదర్స్‌తో బాలకృష్ణ చర్చల విషయంపై తనకు సమాచారం లేదని చెప్పారు. త్వరలో టీడీపీలోకి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement