మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఆయన్ను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. 'నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బతికి ఉన్నప్పుడు చెప్పాలన్న సెన్స్ గానీ, జ్ఞానం కానీ నాకు లేవు. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు . దయచేసి చెప్తున్నా.. మీ ఆత్మీయులు బతికి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్ పంచుకోండి' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ మేరకు తన తండ్రి ఫొటోను షేర్ చేశాడు.
మెగా ఫాదర్ కొణిదెల వెంకట్రావు విషయానికి వస్తే.. శోభన్ బాబు హీరోగా నటించిన ‘జగత్ కిలాడీలు’ అనే ఓ సినిమాలో నటించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో చిరంజీవితో పాటు కలిసి నటించారు.
నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు, నువ్వు బ్రతికి వున్నప్పుడు చెప్పాలన్న సెన్స్ గాని జ్ఞానం కానీ నాకు లేవు...
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 25, 2022
అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు.
To everyone out there...
Please share your emotions & love while your dear ones are alive.
Once again Happy Birthday Dad. pic.twitter.com/wMUkGgHLJ9
చదవండి: రెమ్యునరేషన్ భారీగా పెంచిన ప్రభాస్, ఒక్కో సినిమాకు ఎంతంటే?
నా మొదటి భార్యను కలవాలి, ఆమె ఆలియా మాత్రం కాదు
Comments
Please login to add a commentAdd a comment