Nagababu Konidela Comments On Varun Tej Marriage | ఆ అమ్మాయి అయినా ఓకేనట - Sakshi
Sakshi News home page

వరుణ్‌ పెళ్లిపై నాగబాబు కామెంట్‌.. ఆ అమ్మాయి అయినా ఓకేనట

Mar 18 2021 10:41 AM | Updated on Mar 18 2021 3:17 PM

Nagababu Clarity On Varun Tej Marriage - Sakshi

ఓ యంగ్‌ హీరోయిన్‌తో వరుణ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే వరుణ్‌ తేజ్ మాత్రం..

లాక్‌డౌన్‌ సమయంలో రానా, నితిన్‌, నిఖిల్‌ లాంటి యంగ్‌ హీరోలంతా ఓ ఇంటి వాళ్లయ్యారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఖాళీగా దొరికిన సమయాన్ని జీవిత భాగస్వామికి కేటాయించారు. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటే.. మరికొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఈ యంగ్‌ హీరోలతో పాటు.. కాజల్‌, నిహారిక లాంటి హీరోయిన్లు సైతం లాక్‌డౌన్‌ సమయంలోనే వివాహం చేసుకున్నారు. ఇక మెగా డాటర్‌ నిహారిక పెళ్లి అయిన  మరుక్షణం నుంచి అందరి దృష్టి మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌లపై పడింది.


ముఖ్యంగా వరుణ్‌ పెళ్లి కోసం అయితే మెగా ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఓ యంగ్‌ హీరోయిన్‌తో వరుణ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే వరుణ్‌ తేజ్‌ మాత్రం పెళ్లిపై ఇంతవరకు స్పందించలేదు. కానీ వరుణ్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కానీ, ఇప్పుడే వద్దంటున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పాడు. దీంతో వరుణ్‌ పెళ్లి ఇప్పుడే కాదని అంతా అనుకున్నారు. కానీ తాజాగా వరుణ్‌ పెళ్లి త్వరలోనే ఉంటుందని పరోక్షంగా ఫ్యాన్స్‌కు తెలియజేశాడు నాగబాబు.

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ మెగా బ్రదర్‌.. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో జవాబు ఇచ్చాడు.  'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మంచి సంబంధాలు ఉంటే చూడండి' అని నాగబాబు కామెంట్‌ చేశారు. 'వరుణ్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్ తోనే లైఫ్ అనుకొని ఆ అమ్మాయినే చేసుకుంటా.. అదే ఫిక్స్ అంటే మీరు ఏం చేస్తారు?' అని మరో నెటిజన్ అడగ్గా.. 'మీకు ఓకే అయితే నేనేమంటా..!' అంటూ వరుణ్‌ ప్రేమ వివాహం చేసుకున్న అభ్యంతరం లేదని హింట్‌ ఇచ్చాడు. నాగబాబు సమాధానంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.
చదవండి:
ఆయన లేకపోతే జాతిరత్నాలు లేదు
అప్పులు చేశా.. నాపై నాకే కోపం వచ్చింది : మంచు విష్ణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement