ఏపీలో కీలకంగా ఉన్న నేతలు ఎక్కడ పోటీ చేయనున్నారో అందరికీ ఒక క్లారిటీ ఉంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో రాజకీయలపై ఏ మాత్రం అవగాహన లేని వారు కూడా ఇట్టే చెప్పేస్తారు.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా తమ స్థానాలను ప్రకటించుకున్నారు. కానీ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అయిన పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండూ చోట్ల ఓడిపోయాడు. దీనికి ప్రధాన కారణం ఆయన అహం అని చెప్పవచ్చు.
పవన్‌ను ఇప్పటి వరకు విలువైన రాజకీయ నేతగా ఏపీ ప్రజలు గుర్తించనే లేదు.. అయినా కూడా పవన్‌లో మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ప్రకారమే కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీలను కలుపుకుని వెళ్లిన పవన్‌ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు... ఈ ఎన్నికల్లో కూడా బాబు సలహా మేరకే ఆయనతో మళ్లీ జత కట్టాడు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.. అయితే స్టేజీ ఎక్కుతే చాలు ఊగిపోతాడు.. మొదట గాజువాక నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ అక్కడ ఓడిపాతారని తను చేపించుకున్న సర్వే ఫలితాలు చెప్పడంతో పక్కకు తప్పుకున్నాడు.
ఆ తర్వాత కాకినాడ అనుకున్నాడు అక్కడికి స్వయంగా పవనే వెళ్లి సమీక్షలు కూడా చేశాడు.. అక్కడ కూడా ఎదురు గాలి వీయడం ఖాయం అని రిపోర్టు అందడంతో కాకినాడకు గుడ్‌బై చెప్పాడు. అక్కడి నుంచి పవన్ గాలి భీమవరం వైపు మళ్లింది. అక్కడ కూడా ఆయన సర్వే చేపించుకున్నాడు.. భీమవరంలోని బీసీ,క్షత్రియ,మైనారిటీ వర్గాలన్నీ కూడా జగన్ గారి వైపే ఉన్నాయని తేలడంతో మళ్లీ పవన్ గేరు మార్చి పిఠాపురం బయల్దేరాడు.. అక్కడ కూడా ఆయన సమీక్షలు చేపించుకున్నాడు. అక్కడ వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. అక్కడ కూడా ఆయనకు ఓటమి తప్పదనే సందేహాలు వస్తున్నాయి..
ఇప్పుడు మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే పనిలో పవన్ ఉన్నాడని సమాచారం. పవన్ ఎక్కడ నుంచి బరిలోకి దిగితే అక్కడ కచ్చితంగా బలమైన అభ్యర్ధిని వైసీపీ బరిలోకి దింపుతుంది. ఈ విషయం తెలిసే పవన్ తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది చెప్పకుండా గుట్టుగా వుంచుతున్నాడనేది నగ్నసత్యం. మరి ఇంతలా భయపడే పవన్ ఊగిపోతు మాట్లాడటం ఏంటి అంటూ నెట్టంట సెటైర్లు వేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాదిరి నాగబాబు, పవన్ కల్యాణ్ చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఎంతో కోరికతో ఉన్నారు.. కానీ అది ఈసారి కూడా జరిగేలా లేదు. టీడీపీ-జనసేన కూటమి నుంచి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని నాగబాబు భావించారు. ఈ క్రమంలో ఆయన ఒక ఇల్లు కూడా అక్కడ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కూడా సాగించారు. అక్కడ నుంచే పోటీ చేయాలని భావించే కొణతాల రామకృష్ణను కూడా అన్నాతమ్ముళ్లు కలిశారు. అంతా ఫిక్స్ త్వరలో నాగబాబు పేరు ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి..
ఈ క్రమంలో వారు అనకాపల్లి నియోజకవర్గంలో సర్వే చేపించుకున్నారు కూడా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి పట్ల గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ఆధరణ ఉండటం చూసి కాస్త నాగబాబు వెనకడుగు వేశారట.. ఓడిపోయే దానికి మళ్లీ పోటీ చేయడం ఎందుకని అద్దెకు తీసుకున్న ఇంటిని కూడా కాళీ చేశారట. ప్రస్తుతం మెగా బ్రదర్స్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పడ్డారు. పార్టీ అధినేతే ఎక్కడ పోటీ చేసిదే క్లారిటీ లేకుంటే ఎలా అంటూ పవన్‌పై జోకులు కూడా వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment