April 16th AP Elections 2024 News Political Updates..
06:40 PM, Apr 16th, 2024
కాకినాడ:
సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా
- రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది.
- సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి
- ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే
- కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు.
- మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే
- పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్‌సీపీదే
06:30 PM, Apr 16th, 2024
విజయవాడ:
పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్
- నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు
- డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయలేదు
- అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు
- బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు
- సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు
- ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా?
- టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను
- నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను
- సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు
- బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు
- అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా
- పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది
- టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది
- వైఎస్సార్‌సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు
- అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆసిఫ్‌ని గెలిపించాలి
- లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు
- సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్
- సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్‌లలో తిరిగే వ్యక్తి
06:00 PM, Apr 16th, 2024
అమరావతి:
ప్రభుత్వ ఉద్యోగులపై తప్పుడు వార్తలు రాస్తున్నారు: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి
- కొన్ని పత్రికలు పనికట్టుకొని ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి
- తప్పుడు వార్తల కారణంగా కొంతమంది సస్పెండ్ కావటం బాధాకరం
- ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపించడం సరికాదు
- తప్పుడు కథనాలను నమ్మి చర్యలు తీసుకోవద్దని ఈసీని కోరాం
05:00 PM, Apr 16th, 2024
అమరావతి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాని కలిసిన రావెల కిషోర్‌బాబు
- ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
- పలాస ప్రచారంలో సీఎం జగన్‌ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసారు
- వయసును కూడా మరిచి అసభ్యపదజాలం వాడుతున్నారు
- చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు ఛీత్కరిస్తున్నారు
- ఓటమి భయంతో ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారు
- అబద్దాల చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి పిర్యాదు చేశాం
02:30 PM, Apr 16th, 2024
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ
- పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల.
- చంద్రబాబు, నారా లోకేష్ బీసీ ద్రోహులు.
- కోట్ల రూపాయల కు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకున్నారు.
- కురుబ సామాజిక వర్గానికి చంద్రబాబు అన్యాయం చేశారు.
- త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా: శివబాల
02:00 PM, Apr 16th, 2024
చిత్తూరు జిల్లా
- కుప్పంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 11 మంది టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కుప్పం ఏ.ఈ.ఆర్.వో
- ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకోలేదని నోటీసులు.
- 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న ఏ .ఈ.ఆర్.వో
- వివరణ ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్న ఏ.ఈ.ఆర్.వో
01:30 PM, Apr 16th, 2024
నా మంచితనానికి కూడా హద్దు ఉంటుంది: బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- తెలుగుదేశం నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది.
- కాపు సామాజిక వర్గం సీఎం జగన్ వైపు ఉంది. ఆ ఓట్ల కోసం పవన్ కల్యాణ్‌పై చంద్రబాబే దాడి చేయిస్తాడు.
- పవన్ కల్యాణ్‌ను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా.
- సౌమ్యుడని ముఖ్యమంత్రి గారు నన్ను అన్నారు.
- అంతమాత్రానా నా కుటుంబ సభ్యులు.. నా కార్యకర్తల పై చెయ్యి చేసుకొంటారా?
- ఇక నుంచి రాజకీయం వేరుగా ఉంటుంది. నా కార్యకర్తలపై చెయ్యి వెస్తే.. నిర్ణయాలు వేరేలా ఉంటాయి.
- టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్.. ఇంటికి వచ్చి వైయస్సార్‌సీపీ కార్యకర్తలను బయటికి లాగి కొడతా అన్నాడు.
- మా కార్యకర్తలు చేతకాని వాళ్లు కాదు.. నేను సైగ చేస్తే మీరు ఎవరూ మిగలరు.
- తెలుగుదేశం నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు.
- నా మంచితనానికి కూడా హద్దు ఉంటుంది
12:30 PM, Apr 16th, 2024
చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్
- చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నాడు
- దళితులు, బీసీలపై దారుణంగా మాట్లాడి క్షమాపణ కూడా చెప్పలేదు
- గతంలో టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడిని అవమానించారు
- ఇప్పుడు కూలి జనం అంటూ ప్రజలను అవహేళనగా మాట్లాడుతున్నాడు
- చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఎస్సీ, బీసీ కాలనీలకి వెళ్తాడు
- జనం చంద్రబాబుని నమ్మడం లేదు
- అందుకే ఆయన సభలకు జనం రావడం లేదు
- చివరి అస్త్రంగా సీఎం జగన్‌ను అంతమొందించాలని చూశాడు
- వంగవీటి రంగ, పింగళి దశరథ రామయ్యని చంపిన చరిత్ర చంద్రబాబుది
- చంద్రబాబు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు
- చంద్రబాబు అహంకారానికి ప్రజలు ఓడించి బుద్ధి చెప్తారు
12:20 PM, Apr 16th, 2024
చంద్రబాబుకు కేశినేని శ్వేత కౌంటర్
- చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ
- మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విజయవాడకు చేసిందేమీ లేదు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు స్థానికులు, ఇక్కడ నివాసం ఉంటారు.
- కూటమి అభ్యర్ధులు పొలిటికల్ టూరిస్టులు
- సుజనాచౌదరి పశ్చిమ నియోజకవర్గంలో సీటు తీసుకోవడమే అతిపెద్ద తప్పు
- ఎన్నికలు వచ్చేసరికి జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారం చేస్తున్నారు
- సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా ప్రచారాలు చేసుకోలేదు
- ఒక క్లియర్ విజన్‌తో ట్రేడ్‌లో, అగ్రోలో, వ్యాపారపరంగా విజయవాడను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు
12:05 PM, Apr 16th, 2024
బాలకృష్ణ పర్యటన రద్దు..
- కర్నూలు జిల్లా..
- నేడు కోడుమూరులో జరగాల్సిన బాలకృష్ణ పర్యటన రద్దు.
- టీడీపీ వర్గపోరులో భాగంగా జనసమీకరణ చేయలేక చేతులెత్తెసిన టీడీపీ నాయకులు..
- దీంతో బాలకృష్ణ కోడుమూరులో చేపట్టే రోడ్డు షో రద్దు..
11:50 AM, Apr 16th, 2024
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు
- విజయవాడ
- టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు
- నారా లోకేష్, టీడీపీ తప్పుడు ప్రచారంపై నోటీసులు జారీ
- నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
- నారాలోకేష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- మల్లాది విష్ణు ఫిర్యాదుని పరిశీలించిన ఈసీ
- తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించుకున్న ఈసీ
- చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసిన అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్
11:30 AM, Apr 16th, 2024
నారాయణపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు..
- ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక పలువురు నేతలు.
- సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్.
- పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్.
- కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి.
- పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత
- 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైఎస్సార్‌సీపీలోకి చేరిక.
- టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు.
- కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్‌యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
- ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు జనసేన పార్టీ కీలక నేతలు, యాదవ సంఘం నేతలు.
- జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీవీ రావు, జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవసంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ.
- పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్.
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఇతర నేతలు.
11:05 AM, Apr 16th, 2024
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్
- చంద్రబాబు, రామోజీ రావు, రాధాకృష్ణ ఇతర పెత్తందార్లు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మనం గతంలో చూశాం
- 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేశావ్ చంద్రబాబు?
- రాష్ట్రంలో పేదలకు అవసరమైన పాఠశాలలో ఒక్కటైనా బాగు చెపించావా చంద్రబాబు?
- ఏ రంగం లోనైనా చంద్రబాబు ఒక్క మంచి పని గాని చేశావా?
- టీడీపీ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టావా?.
- ఒక్క పోర్టు గానీ, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టావా?.
- ఇప్పుడు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నావ్.. 14 సంవత్సరాలు నువ్వు గాడిదలు కాసావా?.
- ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క పరిశ్రమ అయినా పెట్టావా?
- నోట్లో సీసం పోస్తాను అంటావా? ఈక కూడా పీకలేవ్ గుర్తుపెట్టుకో చంద్రబాబు.
- గతంలో నీ ప్రభుత్వం హయాంలో రామానాయుడు స్టూడియో, రామోజీరావు కట్టిన రామోజీ స్టూడియో కొండల మీద కట్టలేదా?.
- రుషికొండలో అద్భుతమైన ప్రభుత్వ భవనాలు కట్టింది మా ప్రభుత్వం.
- కోటీ 70 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇస్తాను అని లోకేష్ అన్నాడు. అంత మంది విద్యార్థులు లేరు కదా?.
- 6.2 లక్షల ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చింది.
- తిత్లి తూఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ సమయంలో విజయం అంటూ చంద్రబాబు ఫ్లెక్సీలు వేయించుకున్నాడు
- ఈ ప్రాంతంలో గౌతు కుటుంబ పాలన వల్ల ప్రజలు ఆయుధాలు చేత బట్టి, అడవులుబాట పట్టించిన కుటుంబం అది
- ఈ ప్రాంతంలోని ప్రజలను పట్టి పీడించిన కుటుంబం గౌతు కుటుంబం
- గతంలో ప్రజల తరుపున మాట్లాడుతుంటే చంద్రబాబు నాపై కేసులు పెట్టాడు.
- ఈ ఐదేళ్ళ లో ఒక్క కేసు కూడా మీ నాయకులపై కేసు పెట్టలేదు
- ప్రజాదరణ చూసి ఓర్వలేక రాయితో మా నాయకుడిపై దాడి చేయించావు.
- విశాఖ రాజధాని చేయకూడదా?.
- మా విశాఖకి ఏం తక్కువ.
- ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుందంటే ఎందుకు ఒప్పుకోరు.
- పలసలో కొండలను దోచుకున్న వాళ్ళను మేము పక్కన పెడితే వాళ్లకు చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నాడు
10:50 AM, Apr 16th, 2024
ప్రతిపక్ష పార్టీలకు అది సమాధి ‘రాయి’: అరకు ఎంపీ అభ్యర్థి
- అఫీషియల్ కాలనీలోని బెల్లం గణపతి ఆలయాన్ని సందర్శించిన అరకు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనూజారాణి
- సీఎం జగన్‌పై విసిరిన రాయి ప్రతిపక్ష పార్టీలకు సమాధి రాయి
- సీఎంగా జగన్ రెండోసారి గెలవడం ఖాయం
- గిరిజన ప్రాంత ప్రజలు కృతజ్ఞత తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు
- గిరిజన ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ముఖ్మమంత్రి వైఎస్ జగన్.
10:25 AM, Apr 16th, 2024
పేదలపై కడుపు మంట ఎందుకు చంద్రబాబు?
- పేదలంటే నీకెందుకు ఇంత కడుపు మంట చంద్రబాబు.
- అవును.. జగనన్న కోసం వస్తున్నది కూలీ చేసుకుని పొట్ట నింపుకునే వాళ్లే..
- మాతో ఉంటోంది కూడా వాళ్లే.. మీలాంటి పెత్తందార్లతో మేం పోరాడుతున్నది కూడా వాళ్ల కోసమే -వైఎస్సార్‌సీపీ
పేదలంటే నీకెందుకు ఇంత కడుపు మంట @ncbn..?
— YSR Congress Party (@YSRCParty) April 16, 2024
అవును.. జగనన్న కోసం వస్తోంది కూలీ చేసుకుని పొట్ట నింపుకునే పేదోళ్లే
మాతో ఉంటోంది వాళ్లే.. మీలాంటి పెత్తందారులతో మేం పోరాడుతోంది కూడా వాళ్ల కోసమే!#TDPAntiPoor#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/LqnjJN47xU
10:00 AM, Apr 16th, 2024
పిఠాపురంలో ఫలితమేదైనా వర్మకు వేదనే..
- గెలిస్తే తన బలమంటూ పవన్ గొప్పలు
- ఓడితే మాజీ ఎమ్మెల్యే వెన్నుపోటని ముద్ర
- ఏం జరిగినా వర్మకు రాజకీయ సమాధే..
- క్యాడర్‌తో మమేకం కాని జనసేనాధిపతి
- కొందరు నచ్చజెప్పగా రోజుకు 200 మందితో సెల్పీలకు సమ్మతి
- ఇప్పుడే ఇలాగుంటే రేపటి మాటేమిటంటున్న స్థానికులు
9:00 AM, Apr 16th, 2024
చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్..
- చంద్రబాబుది మాయా కూటమి.
- సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక దాడులు.
- ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక.. వెనుక నుంచి దాడి చేయడం దుర్మార్గం.
చంద్రబాబుది మాయా కూటమి..సీఎం @ysjagan గారికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక..
— YSR Congress Party (@YSRCParty) April 15, 2024
ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ... వెనుక నుంచి దాడి చేయడం దుర్మార్గం.
-మాజీ మంత్రి కొడాలి నాని#MemanthaSiddham#YSJaganAgain#TDPJSPBJPCollapse pic.twitter.com/x1PDr8th3y
8:30 AM, Apr 16th, 2024
ఎంపీ విజయసాయి ప్రచారం.. మార్కెట్ వ్యాపారులకు కీలక హామీ
- ప్రచారంలో కూరగాయల వ్యాపారస్తులు, కొనుగోలుదారులను ఆప్యాయంగా పలకరించిన విజయసాయిరెడ్డి
- వైఎస్సార్‌సీపీని దీవించాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి
- వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి వచ్చాక మార్కెట్ పక్కన ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం మార్కెట్‌గా మారుస్తామని హామీ
- కూరగాయల మార్కెట్‌ను ఆధునిక ప్రమాణాలతో, అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించిన విజయసాయి.
7:45 AM, Apr 16th, 2024
ఎల్లుండి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం
- నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ
- ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు
- ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
- ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
- మే 13న పోలింగ్
7:15 AM, Apr 16th, 2024
విశాఖ ఎంపీ సీట్లుపై కొత్త ట్విస్ట్..
- విశాఖ ఎంపీ స్థానంపై పట్టు విడవని జీవీఎల్
- ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో జీవీల్ లాబీయింగ్.
- ఉత్తరాది వ్యాపారులతో సమావేశమైన జీవీఎల్.
- విశాఖ ఎంపీ స్థానం కోసం ఉత్తరాది వ్యాపారులతో బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి.
- జీవీఎల్‌కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు.
- జీవీఎల్‌కు మద్దతుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిసిన బీజేపీ నాయకులు.
- టీడీపీ నేత భరత్ ప్రచారానికి దూరంగా జీవీఎల్.
- చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై గుర్రుగా జీవీఎల్.
7:00 AM, Apr 16th, 2024
నా సంకల్పం చెదరదు: సీఎం జగన్
- ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్.
- చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున..
- ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు
- కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద.
- మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు.
- అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు
- కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ.
- చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు
- జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు
- పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము
- ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు
- మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు
- నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం.
- నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.
- మీ జగన్‌పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది
- రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే
- కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే
- ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే
- గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
- పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
- తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
- విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
- ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే
- చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే.
6:50 AM, Apr 16th, 2024
పవన్, బాలకృష్ణపై చర్యలు తీసుకోండి..
- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
- ఎన్నికల కోడ్ ఉల్లఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన, బాలకృష్ణ.
- 13న కదిరి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ,
- ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో పవన్ అనుచిత వ్యాఖ్యలు
- ఈనాడు ఎన్నికల కోడ్ విరుద్ధంగా వార్తలు రాస్తోంది.
6:45 AM, Apr 16th, 2024
వివేకా కేసు బాబు ప్రయోజనాల కోసమేనా?.
- షర్మిల, సునీత చేస్తున్నది న్యాయ పోరాటమా.. రాజకీయ పోరాటమా?
- రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి ఉండాలి
- చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్
- వివేకాను ఓడించేందుకు స్పెషల్ చార్టెర్డ్ ఫ్లయిట్లు ఉపయోగించారు
- అప్పట్లో కోట్లు ఖర్చుచేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొన్నారు
- ఈ ఎన్నికల్లో కూడా సుమారు 40 సీట్లు రూ.వందల కోట్లకు అమ్ముకున్నారు
- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి
6:40 AM, Apr 16th, 2024
పాపాల ధూళిపాళ్ల..
- దౌర్జన్యాలకు కేరాఫ్.. ధూళిపాళ్ల నరేంద్ర
- గ్రావెల్, ఇసుక తవ్వకాలతో అడ్డగోలుగా దోపిడీ
- సంగం డెయిరీనీ సొంత ఆస్తిగా మార్చేసిన నేత
- దాని ప్రాంగణంలో తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణం
- దేవదాయ భూముల్నీ వదల్లేదు
- నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో దిట్ట
- సుద్దపల్లి చెరువును క్వారీగా మార్చేందుకు యత్నం
- తిరగబడిన స్థానికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
- ఆయన కబ్జాలకు గజగజలాడిన పొన్నూరు నియోజకవర్గం
6:30 AM, Apr 16th, 2024
పొత్తు చిత్తే.. బాబుకు కొత్త షాక్‌లు..
- చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సైసై.. స్థానిక నేతలు నైనై
- సీట్ల కేటాయింపును తప్పు పడుతున్న మూడు పార్టీల శ్రేణులు
- చంద్రబాబు, పవన కళ్యాణ్‌లు తమను మోసం చేశారని సీట్లు రాని నేతల ఆవేదన
- అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు పార్టీలు కలవడం కల్లే
- బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
- జనసేన, బీజేపీ పోటీలో ఉన్న చోట ముఖం చాటేస్తున్న టీడీపీ నేతలు
- తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా
- బాలకృష్ణ యాత్రలో కనిపించని బీజేపీ, జనసేన నేతలు
- ఆ ముగ్గురి ఆరాటమే తప్ప క్షేత్ర స్థాయిలో అమలు కాని పొత్తు
- ఇలాగైతే ఓట్ల బదిలీ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment