
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన మెగాబ్రదర్ నాగబాబు.. తాజాగా ఆయనే లక్ష్యంగా ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్ చేశారు. ఓ బాలుడు చక్కగా.. ఏ మాత్రం తడబడకుండా దేశభక్తి గీతం ‘సారే జహాసే.. అచ్చా’ ఆలపించిన వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పంచుకున్నారు. నాగబాబు ఏ ఉద్దేశంతో పోస్ట్ చేసినప్పటికీ.. మెగా అభిమానులు మాత్రం బాలయ్యకు కౌంటర్‌గానే అని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య ‘సారే జహాసె అచ్చా’ గీతాన్ని తడబడుతూ పాడి నవ్వులపాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది.
బుల్‌బుల్ బాలయ్య అంటూ ఈ నందమూరి హీరోపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. దీనికి కౌంటర్‌గానే నాగబాబు ఈ చిన్నపిల్లోడు పాడిన వీడియో పోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య ఎవరో తెలియదు, అతనో కమెడియన్ అంటూ చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతుండగా.. తాజా వీడియో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. సోషల్ మీడియా వేదికగా మెగా, నందమూరి అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment