
నరసాపురం ఎంపీగా జనసేన నుంచి బరిలోకి దిగిన నాగబాబుకు షాక్ తగిలింది. నాగబాబు తరుపున ఆయన కుటుంబం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. వరుణ్‌తేజ్, నిహారిక, భార్య పద్మజ నాగబాబు తరుపున ప్రచారంలో పాల్గొంటూ ఉండగా.. మిగతా మెగా హీరోలు కూడా వస్తారని అనుకున్నారు. దీనిలో భాగంగానే.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నాగబాబును సపోర్ట్ చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వినిపించాయి. నాగబాబు భార్య పద్మజ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బన్నీ ప్రచారానికి వస్తారని తెలిపారు. దీంతో బన్నీ ప్రచారంలో వస్తున్నాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ అంతలోనే బన్ని ఒకే ఒక్క ప్రకటనతో అందరికీ షాక్ ఇచ్చారు.
తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా.. తన మద్దతు నాగబాబుకు ఉంటుందని ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా.. మోరల్‌గా ఎప్పుడూ తన వెంట ఉంటామని.. మా సపోర్ట్ తనకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసుకుంటామని ఆశించిన బన్నీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే మరో వైపు.. బన్నీ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణముందని, అందుకే ఒకే ఒక ప్రకటనతో చేతులు దులుపుకున్నారని టాక్ వినిపిస్తోంది.
BEST WISHES pic.twitter.com/65HonIrB3c
— Allu Arjun (@alluarjun) 6 April 2019
Comments
Please login to add a commentAdd a comment