నటి, నాగబాబు ముద్దుల తనయ నిహారిక- బిజినెస్‌మేన్ చైతన్యల ఎంగేజ్‌మెంట్‌తో కొణిదెల వారింట సందడి నెలకొంది. మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిహారిక నిశ్చితార్థ వేడుకలోని కొన్ని అన్‌సీన్ మూమెంట్స్‌ని పంచుకున్నారు. కాబోయే వధూవరులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల మీడియాలో వైరల్ అవుతోంది.(డియర్ చై.. నీ ప్రేమను తనపై కురిపించు: నాగబాబు)
ఈ క్రమంలో నిహారిక- చైతన్యల జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిహారిక నిశ్చితార్థం గుంటూరుకి చెందిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఫంక్షన్‌కు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర తారాగణం సతీమేతంగా హాజరయ్యారు. వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా కుటుంబ ఆడపడుచులు, మరికొందరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment