![Naga Babu Respond On Naresh Comments On Chiranjeevi Over MAA Elections - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/13/naga-babu.jpg.webp?itok=7gIhJAku)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. అయిన ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాజీనామాలు, ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేశ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్ నాగబాబు, నరేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య(చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు.
చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడు ఆయన అనలేదని, అన్నయ్యకు అంత అహంకారం లేదని నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు సంబంధం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment