
అధికారమే పరమావధిగా ఏర్పడిన టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు అప్పుడే స్టార్టయ్యాయి. జనసేన పార్టీకి సీట్ల కేటాయింపుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నుసన్నుల్లోనే జరుగుతుండడం జనసైన్యానికి మింగుడు పట్టడం లేదు. కొంతమంది బహిరంగంగా బాబు తీరును విమర్శిస్తుంటే.. మరికొంతమంది అంతర్గతంగా మాట్లాడుకొని తగిని బుద్ది చెప్పాలని డిసైడ్ అవుతున్నారు.
(చదవండి: ట్వీటు రాజా? పోటీ లేదా?)
పొత్తు పట్ల పవన్ వైఖరి అతని సోదరుడు నాగబాబుకు కూడా నచ్చడం లేదు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ.. బాబు కుట్రతో ఆయన పోటీకి దూరమయ్యాడు. అంతేకాదు పలు చోట్ల జనసేన అభ్యర్థులను ఓడించడానికి బాబు కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నాగబాబు వరకు చేరినట్లు ఉంది. అయితే సోదరుడు పవన్ కల్యాణ్ బాబుని గుడ్డిగా నమ్ముతుండడంతో నేరుగా అతనితో చెప్పలేకపోతున్నాడట. అందుకే ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.
తాజాగా కన్ఫ్‌యూషియస్ కొటేషన్‌ని ఎక్స్‌లో షేర్ చేస్తూ పరోక్షంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్‌కు చురకలు అంటించాడు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లువుతారు’ అనే కన్ఫ్‌యూషియస్ కొటేషన్‌ని నాగబాబు ఎక్స్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
‘వయసులో బాగా పెద్దవారైనా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడటం చాలా తప్పు, పైగా మీ పార్టీ టీడీపీతో పొత్తుతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు, పొత్తు ధర్మాన్ని పాటించండి’ ‘ఇది అయితే చంద్రబాబు నే అంటున్నావ్ అని క్లియర్ గా తెలుస్తుంది....లేదంటే మోడీ గారిని’, ‘అయ్యో మీరు ఇలా డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అనడం చాలా తప్పు’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
( గమనిక: ఏమి మాట్లాడిన మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు,ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దిషించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం) pic.twitter.com/HhOfVu4igE
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2024
Comments
Please login to add a commentAdd a comment