
మెగాబ్రాదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారంటూ పలువురు ప్రశ్నించగా..తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే మీ ముందుకు వస్తాడంటూ పేర్కొన్నారు. చదవండి : డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు
ఇక మరో యూజర్.. బిగ్‌బాస్ లేదా ఐపీఎల్...ఈ రెండింట్లో ఏది ఫాలో అవుతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా..'బిగ్‌బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా' అంటూ క్రేజీగా బదులిచ్చారు నాగబాబు.
దీనికి స్పందించిన ప్రియాంక సింగ్ టీం నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 'మీరు ఎప్పుడు ఎవరిని ఊరికే సపోర్ట్ చేయరు ... జెన్యూన్ పర్సన్స్ ని తప్ప, ఆ జెన్యూన్ నేచర్ మన పింకీని ఇంత వరకూ తీస్కోచ్చింది ...మీకు లాగే అందరూ సపోర్ట్ చేసేలా చేస్తోంది' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఇప్పటికే నాగబాబు బిగ్‌బాస్-5లో తనకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, అయినప్పటికీ ప్రియాంక సింగ్‌కే తన మద్దతు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నడ నటి సంజన గల్రానీ సైతం ప్రియాంక సింగ్‌ను విన్నర్‌గా చూడాలనుందని పేర్కొంది. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే..
Comments
Please login to add a commentAdd a comment