
సాక్షి, హైదరాబాద్ : తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలపై పవన్.. తన న్యాయవాదులతో ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ వెంటనే సోదరుడు నాగబాబు రాగా.. మా ప్రెసిడెంట్ శివాజీరాజా, రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, పరుచూరి వెంకటేశ్వరరావు, మెహర్ రమేష్, నరేష్, హేమ తదితరులు ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. కాసేపట్లో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్వీటర్ వేదికగా పవన్ గత రాత్రి నుంచి సంచలన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ అభిమానులు భారీగా ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంటుండగా.. మా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీరెడ్డి వివాదం.. మొత్తం కుట్రకు సూత్రధారి చంద్రబాబే : పవన్
Comments
Please login to add a commentAdd a comment