
సాక్షి, పశ్చిమ గోదావరి : లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ కామెడీ ఏ మాత్రం సరిపోదని జనసేన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు ఎద్దేవా చేశారు. గురువారం తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ అవినీతి పరులను నడిరోడ్డులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మానసిక స్థితి సరిగాలేదని ఆరోపించారు. ఆయన పరిస్థితే బాగా లేదంటే ఆయన కొడుకు లోకేష్ సినిమాల్లో రేలంగిలా తయారయ్యాడంటూ ఎగతాళి చేశారు
తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నాని నవ్వుతూ ఉంటాడే తప్ప ఏ పనీ చేయ్యడని ఆరోపించారు. టీడీపీ నేతలు మట్టి తినేస్తున్నారంటే కొన్ని రోజుల్లో మనుషుల్ని కూడా తినేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అవకాశం వస్తే ఒక ఎంపీ ఏమేమీ చేయగలడో అవన్ని చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.