SS Rajamouli: కోవిడ్‌పై రాజమౌళి లఘు చిత్రం? | SS Rajamouli to direct a short film on the Covid-19 pandemic | Sakshi
Sakshi News home page

SS Rajamouli: కోవిడ్‌పై రాజమౌళి లఘు చిత్రం?

Published Sun, Jun 6 2021 6:29 AM | Last Updated on Sun, Jun 6 2021 9:37 AM

SS Rajamouli to direct a short film on the Covid-19 pandemic - Sakshi

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఎంత వేగంగా వ్యాపిస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ మహమ్మారిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ లఘు చిత్రం (షార్ట్‌ ఫిల్మ్‌) తెరకెక్కించనున్నారని టాక్‌. ప్రస్తుత ఈ క్లిష్ట పరిస్థితులపై 19 నిమిషాల నిడివి గల షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించనున్నారట.

వీలైనంత త్వరగా ఈ లఘు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. త్వరలో తిరిగి చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement