ఓ రైటర్‌ కథ | Actress Payal Rajput stars in her first short film | Sakshi
Sakshi News home page

ఓ రైటర్‌ కథ

Published Mon, May 18 2020 12:18 AM | Last Updated on Mon, May 18 2020 12:18 AM

Actress Payal Rajput stars in her first short film - Sakshi

పాయల్‌ రాజ్‌ పుత్

లాక్‌ డౌన్‌ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటున్నారు. వంటకాలతో ప్రయోగాలు, కొత్త భాషపై పట్టు సాధించడం వంటివి చేస్తున్నారు. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పుత్‌ ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశారు. ‘ఎ రైటర్‌’ టైటిల్‌ తో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ను 24 గంటల్లో చిత్రీకరించారట. గృహ హింస కాన్సెప్ట్‌తో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కింది. ఇందులో రచయిత పాత్ర చేశారు పాయల్‌. ‘‘లాక్‌ డౌన్‌ వల్ల కెమెరా ముందుకి వెళ్లడం కుదరడం లేదు.  ఈ షార్ట్‌ ఫిల్మ్‌ చేయడం ఆ బాధను కొంత తగ్గించింది. నా అభిమానులందరికీ ఈ షార్ట్‌ ఫిల్మ్‌ అంకితం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు పాయల్‌. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కి పాయల్‌ మిత్రుడు సురభ్‌ దిగ్ర దర్శకత్వం వహించారు. 16 నిమిషాలున్న ఈ ఫిల్మ్‌ ను యు ట్యూబ్‌ లో చూడొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement