సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్, బయోమెడికల్ తదితర వ్యర్థాలపై లఘు చిత్రాల (షార్ట్‌ఫిల్మ్‌స్) ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వినాయకచవితి, దీపావళి పండుగల సందర్భంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు మట్టి గణపతుల వినియోగం, బాణాసంచా వాడకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తోంది. ప్లాస్లిక్, ఇతర వ్యర్థాలపై కూడా షార్ట్‌ఫిల్మŠస్, మీడియా, తదితర రూపాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. వ్యర్థాలకు సంబంధించి కేంద్రం రూపొందించిన నిబంధనలను కూడా లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయనుంది.
ప్లాస్టిక్ ‘బ్యాగుల’ ఉత్పత్తిపై నియంత్రణ..
ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను 50 మైక్రాన్లకు తగ్గకుండా ఉండేలా ప్రమాణాలను పాటించేలా తయారీ దశలోనే నియంత్రణ ఉండేలా చూడాలని నిర్ణయించింది. కిందిస్థాయిలో దీని అమలు పర్యవేక్షణను స్థానిక సంస్థలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న క్యారీబ్యాగులు వస్తున్నట్లు సైతంఅధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 కామన్ బయో–మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ (సీబీఎండబ్ల్యూటీఎఫ్) పనిచేస్తుండగా, బయోమెడికల్ వేస్ట్‌ను తరలించే వాహనాలకు జీపీఎస్ ద్వారా అనుసంధానించి ఆన్‌లైన్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విషయంలోనూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ–వేస్ట్ సేకరణ, ధ్వంసం చేసే కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగవుతుండటంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహనకు షార్ట్‌ఫిల్మ్‌లు!
Published Sat, Feb 11 2017 12:05 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement