
నటుడు విజయ్ కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న విషయం తెలి సిందే. దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌కు వారసుడిగా విజయ్ రంగప్రవేశం చేశారు. తాజాగా విజయ్ వారసుడు జెసన్ సంజయ్ రంగప్రవేశం చేశాడు. అయితే సంజయ్ ఇంతకు ముందే తండ్రితో కలిసి బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించాడన్నది తెలిసిందే. ఇతను ఇప్పుడు తాత ఎస్‌ఏ. చంద్రశేఖర్ దర్శకత్వ వారసత్వాన్ని, తండ్రి విజయ్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తొలి ప్రయత్నంలోనే ఏకకాలంలో స్వీయ దర్శకత్వంలో నటించేశాడు. అయితే ఇతను తొలి ప్రయత్నంగా లఘు చిత్రాన్ని ఎంచుకున్నాడు. జంక్షన్ పేరుతో జెసన్ సంజయ్ తెరకెక్కించిన థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ లఘు చిత్రం బుధవారం యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.