షష్టి, సరస్ లఘు చిత్రాలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టాయి. షష్టి లఘు చిత్రం 2022లో 35వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 75 అవార్డులను గెలుచుకుంది. ఇక సరస్ అనే లఘు చిత్రం 2023లో 20వ అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో పాల్గొని 70కి పైగా అవార్డులను గెలుచుకుందని ఈ లఘు చిత్రాల దర్శకుడు జూట్ పీటర్ డెమియన్ పేర్కొన్నారు. ఈయన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కావడం గమనార్హం.
గత 30 ఏళ్లుగా ఆ రంగంలో విశేష సేవలు అందించిన ఆయన సినిమా రంగంపై ఆసక్తితో ఆ వృత్తి నుంచి బయటకు వచ్చారు.ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి తొలి ప్రయత్నంగా షష్టి అనే లఘు చిత్రాన్ని రూపొందించారు. పలువురి ప్రశంసలను అందుకున్న ఈ లఘు చిత్రం అంతర్జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో 75 అవార్డులను గెలుచుకోవడంతో అదే ఉత్సాహంతో సరస్ అనే మరో లఘు చిత్రాన్ని రూపొందించారు. ఇది కూడా 70 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.
సొంత ఆలోచనలను, అనుభవాలను, కళాత్మకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిత్రాలను ప్రేక్షకుల అందించాలన్న భావనతో తానీ రంగంలో వచ్చినట్లు జూట్ పీటర్ డెమియన్ పేర్కొన్నారు. కాగా షష్టి ఇప్పుడు యాపిల్ టీవీ అనే ఓటీటీ యాప్‌తో పాటు ఇతర యూట్యూబ్ చానల్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సరస్ లఘు చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
చదవండి: డబ్బు కోసం వ్యాపారిని బెదిరించిన సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డ్
Comments
Please login to add a commentAdd a comment