షార్ట్ ఫిలింలో సిద్ధార్థ్ | A New Platform for Short Filmmakers | Sakshi
Sakshi News home page

షార్ట్ ఫిలింలో సిద్ధార్థ్

Published Wed, Nov 12 2014 3:28 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

షార్ట్ ఫిలింలో సిద్ధార్థ్ - Sakshi

షార్ట్ ఫిలింలో సిద్ధార్థ్

నటుడు సిద్ధార్థ్ షార్ట్ ఫిలింలో నటించనున్నారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కోలీవుడ్‌లో నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. షార్ట్ ఫిలింస్ నిర్మాణం కోసం అంటూ సొంతంగా స్టోన్ బెంచ్ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమవారం స్థానిక అన్నాశాలైలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు భారతీరాజా సంస్థ బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతగా అవతారమెత్తిన కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ సినీ రంగంలో రాణించాలని తపిస్తున్న ప్రతిభావంతులు చాలామంది ఉన్నారన్నారు. అలాంటి వారందరికీ ఈ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందని భావిస్తున్నారన్నారు. తాను సిద్ధార్థ్‌తో తెరకెక్కించనున్న ఈ షార్ట్ ఫిలింను థియేటర్లలోను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
 
అదే విధంగా ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్‌తో ఏ భాషలోనైనా విడుదల చేయవచ్చని కార్తీక్ సుబ్బరాజ్ వివరించారు. తన ఈ సంస్థలో టాలెంట్ ఉన్న ఇతరులకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. సిద్ధార్థ్ జగర్‌తండ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు అదే హీరోతో షార్ట్ ఫిలిం రూపొందించడం విశేషం. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎస్.జె.సూర్య, నిర్మాత కె ఇ జ్ఞానావేల్ రాజా, బాలాజీ మోహన్ తదితర చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement