Published
Tue, Jul 19 2016 10:17 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
హరితహారం షార్ట్ ఫిల్మ్ సీడీ ఆవిష్కరణ
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని కేఎస్ రెడ్డి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో హరితాహారంపై నిర్మించిన షార్ట్‌ఫిల్మ్ సీడీని మంగళవారం పట్టణంలోని పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంపై చిన్నారులతో షార్ట్‌ఫిల్మ్ తీయడం అభినందనీయమన్నారు. షార్ట్‌ఫిల్మ్‌లో మొక్కల ప్రాధాన్యం గురించి చక్కగా వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కల్లెపల్లి మహేశ్వరి, పాఠశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.నిర్మల, దశరథ తదితరులు పాల్గొన్నారు.