
సాక్షి, హైదరాబాద్: డిజిటిల్ మీడియంకు సెన్సార్ నిబంధనలు వర్తించకపోవటంతో లఘు చిత్రాలు తరుచూ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన ఓ లఘు చిత్రం తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పలు బ్రాహ‍్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘బ్రాహ్మణ సమాజాన్ని కించపరచే విధంగా లవ్ జీహాద్ ను ప్రేరేపించే విధంగా నిర్మిస్తున్న ‘బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి’ లఘు చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని...సినిమా ట్రయిలర్‌ను యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నారు.
వివాదాస్పద లఘు చిత్రాన్ని తెరకెక్కించిన చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాంతినగర్ ప్రాంతానికి చెందిన విశాల్, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ రోజు (బుధవారం) రీజినల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్, డీజీపీ మహేందర్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిలను కలిసి షార్ట్ ఫిలింను నిషేదించాల్సిందిగా కోరనున్నారు. షార్ట్‌ఫిలింను తెరకెక్కించిన దర్శకుడు ఫారుఖ్ రాయ్, నిర్మాత చంచల్ శర్మలతో పాటు ఇతర చిత్ర బృందంపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment