
సన్నీ లియోన్‌లా కావాలని..
నేను.. సన్ని లియోన్‌లా కావాలనుకుంటున్నాను. ఆమెలాగా సెక్సువాలిటీయే పట్టుబడిగా డబ్బు సంపాదించి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా..
‘ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి కావాలనుకుంటారు. నేను.. సన్ని లియోన్‌లా కావాలనుకుంటున్నాను. ఆమెలాగా సెక్సువాలిటీయే పెట్టుబడిగా డబ్బు సంపాదించి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా..’ అంటూ ఓ యువతి తన తల్లిదండ్రుల ముందే బాంబు పేల్చడంతో మొదలవుతుంది.. ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్‌నా చాహ్‌తీ హై’(నా కూతురు సన్నీ లియోన్‌లా కావాలనుకుంటోంది) షార్ట్ ఫిలిం. సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ఈ లఘుచిత్రం శనివారం యూట్యూబ్‌లో విడుదలైంది.
తనకు నచ్చినట్లు జీవిస్తానని వాదించే అమ్మాయి, ఆ మార్గం సరైంది కాదని వారించే తల్లిదండ్రుల నడుమ ఒక గదిలో చోటుచేసుకున్న సంభాషణను షార్ట్ ఫిలింగా మలిచిన ఆర్జీవీ.. కేవలం నాలుగు గంటల్లోనే 50వేలకు పైగా హిట్స సాధించడం గమనార్హం. ‘గన్స అండ్ థైస్’ వెబ్ సిరీస్ ప్రోమోలో హింస, శృంగారాన్ని విచ్చలవిడిగా చూపించిన వర్మ.. ‘మేరీ బేటీ సన్నీలియోన్..’లో మాత్రం అలాంటి పని చేయలేదు. అయితే సంభాషణలు మాత్రం పీక్స్‌లో ఉంటాయి.
సన్నీ లియోన్ కావాలనుకునే యువతిగా నైనా గంగూలీ(వంగవీటి ఫేం), తండ్రి పాత్రలో మకరంద్ దేశ్‌పాండే(ఏక్‌నిరంజన్, దండుపాళ్యం ఫేం), తల్లిపాత్రలో దివ్యా జగ్దలే నటించారు. ఆర్జీవీ టాకీస్ పతాకంపై రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం నిడివి 11.30 నిమిషాలు. దీనిని చూసి ఎప్పటిలాగే ‘వర్మ పర్వర్షన్ ఇంకాస్త శృతిమించింద’ని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.