బీ టౌన్‌లో కరణ్ జోహార్ ప్రజెంట్ ఎంత బడా నిర్మాతో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కుచ్ కుచ్ హోతా హై, ‘మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్’ వంటి హిందీ చిత్రాలను కూడా డైరెక్ట్ చేశారాయన. గతేడాది వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రమే డైరెక్టర్‌గా కరణ్‌కు లాస్ట్ మూవీ. ఆ తర్వాత ప్రొడక్షన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారాయన. అయితే మరోమారు డైరెక్టర్‌గా మారి, ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని కరణ్ డిసైడైయ్యారట. ఇందులో పరిణీతి చోప్రాను హీరోయిన్‌గా చేయమని సంప్రదించారట.
కానీ, ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ కాకపోవడంతో ఆమె ‘నో’ చెప్పారన్నది బాలీవుడ్ టాక్. దీంతో పరిణీతీ చోప్రా, కరణ్ జోహర్‌ల మధ్య కుచ్ కుచ్ రాంగ్ హోతా హై అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘‘ఈ వార్తలు నిజం కాదు. దయచేసి చెక్ చేసుకుని నిజాలు రాయగలరు’’ అని పేర్కొన్నారామె. ఇప్పుడు అర్థమైందిగా.. కరణ్ జోహర్‌కు, పరిణీతీ చోప్రాకు ప్రాబ్లమ్ కుచ్ కుచ్ నహీ హై అని. ఈ సంగతలా ఉంచితే పరిణీతీ చోప్రా ప్లేస్‌లో కియారా అద్వానీ (ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్)ని సెలక్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment