లాక్‌ డౌన్‌లో ప్రయోగం | Andrea Acts In A Lockdown Short Film Movie | Sakshi
Sakshi News home page

లాక్‌ డౌన్‌లో ప్రయోగం

Published Wed, Apr 29 2020 3:18 AM | Last Updated on Wed, Apr 29 2020 10:28 AM

Andrea Acts In A Lockdown Short Film Movie - Sakshi

లాక్‌ డౌన్‌ సమయంలో ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతను ఎలా ప్రవర్తిస్తాడు?  అనే నేపథ్యంలో తెరకెక్కిన షార్ట్‌ ఫిలిం ‘లాక్‌ డౌన్‌’. నటి, గాయని ఆండ్రియా ముఖ్య పాత్రలో ఈ షార్ట్‌ ఫిలిం రూపొందింది. ఆదవ్‌ కన్నదాసన్‌ దర్శకత్వం వహించిన ఈ మూడున్నర నిమిషాల లఘు చిత్రాన్ని ఐ ఫోన్‌ లో చిత్రీకరించారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి వీడియో కాల్స్‌ ద్వారా ఈ షార్ట్‌ ఫిలిం షూట్‌ చేశారు. ఒక పూటలో షూటింగ్‌ పూర్తి చేసేశారని సమాచారం. ‘‘దర్శకుడు ఆదవ్‌ నాకు ఓ ఏడాదిగా తెలుసు. తను చాలా టాలెంటెడ్‌. ఆదవ్‌ రైటింగ్, డైరెక్షన్‌ సైడ్‌ వస్తే బాగుంటుదనుకున్నాను. తను చెప్పిన ఈ షార్ట్‌ ఫిలిం ఐడియా నాకు బాగా నచ్చింది. ఫోన్‌ లో షూట్‌ చేసిన ఫిలింలో యాక్ట్‌ చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది... అది ఇప్పటికి కుదిరింది. ఈ షార్ట్‌ ఫిలిం కాన్సెప్ట్‌ చాలా కొత్తగా ఉంటుంది. కొత్తగా ఆలోచించాలనుకునేవాళ్లకి మా షార్ట్‌ ఫిలిం ఒక ఉదాహరణగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు ఆండ్రియా. ఈ షార్ట్‌ ఫిలిం నేడు విడుదల  కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement