
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో 'మాసాబ్' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు.
Aditya Om Pavithra Short Film: 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో 'మాసాబ్' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు 'పవిత్ర' అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
థ్రిల్లింగ్ జానర్‌గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మోడర్న్ సినిమా బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. దీనికి వీరల్, లవన్ సంగీతం అందించగా.. మధుసూదన్ కోట సినిమాటోగ్రాఫర్‌గా, ప్రకాష్ ఝా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్‌ని యూట్యూబ్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఆదిత్య ఓం చేతిలో మొబైల్ ఫోన్స్, ఆ వెనకాల జ్యోతి, గాయత్రీ గుప్త లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మిస్ అయిన తన భార్య కోసం ఓ బ్లైండ్ డాక్టర్ వెతికే పాయింట్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ షార్ట్‌ఫిలిమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు
టైటిల్ రోల్ జ్యోతి పోషిస్తుండగా.. గాయత్రి గుప్త మరో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. గాయత్రీ రోల్ సినిమాలో కీలకం కానుందట. జాకిర్ హుస్సేన్, ఐశ్వర్య, వెంకట్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పెరుగుతున్న టెక్నాలజీలో షార్ట్ ఫిలిమ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కెమెరా ముందు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు అనువుగా ఉండటమే గాక ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంటాయని ఆదిత్య ఓం అన్నారు. అలాంటి కోవలోనే ఈ 'పవిత్ర' మూవీ ఉంటుందని చెప్పారు.
చదవండి: విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో