కథ వింటారా? | Vidya Balan Shares Poster of Her First Short Film Natkhat | Sakshi
Sakshi News home page

కథ వింటారా?

Published Thu, May 28 2020 3:23 AM | Last Updated on Thu, May 28 2020 3:23 AM

Vidya Balan Shares Poster of Her First Short Film Natkhat - Sakshi

విద్యాబాలన్‌

‘ఓ మంచి కథ ఉంది. వింటారా?’ అని అడుగుతున్నారు విద్యాబాలన్‌. ఆ కథ ఆమెకు చాలా నచ్చింది. అందుకే అందరికీ కథ చెప్పాలనుకున్నారు... కాదు కాదు... చూపించాలనుకున్నారు. ఆ కథతో తొలిసారి ఓ షార్ట్‌ఫిల్మ్‌లోయాక్ట్‌ చేయడానికి అంగీకరించారామె. ‘నటఖట్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నటించడమే కాకుండా నిర్మించారు (రోనీ స్క్రూవాలాతో సంయుక్తంగా) కూడా విద్యా. షాన్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ షూటింగ్‌ గత ఏడాదే పూర్తయిందట. త్వరలోనే ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

‘నటఖట్‌’ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో పిల్లాడి తల నిమురుతూ ఆలోచనల్లో నిమగ్నమైన గృహిణిగా విద్యా కనిపిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాతని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ కథ వినగానే షార్ట్‌ఫిల్మ్‌ని నేనే నిర్మించాలనుకున్నాను. ఈ కథ నన్నెంత ఆశ్చర్యానికి గురి చేసిందో మిమ్మల్ని కూడా అంతే ఆశ్చర్యానికి గురి చేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement