
షార్ట్ ఫిల్మ్లో సునీత..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత తొలిసారిగా నటిస్తున్న ‘రాగం’ షార్ట్ ఫిలిం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఒంటరి మహిళ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కలలను ఎలా సాకారం చేసుకుందో తెలియజెప్పే కథాంశంతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు రూపకర్తలు చెప్పారు. చైతన్య శ్రీ పెరంబుదూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయికిరణ్, పవిత్ర లోకేశ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.