
నయనతార నటిస్తున్న తాజా ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం ‘ఐరా’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో నయనతార డ్యూయల్ రోల్ చేశారు. సుదర్శన్, సుందరామ్మూర్తి, రవీంద్రన్, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. తమిళనాట ‘లక్ష్మీ’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి పేరు సంపాదించుకున్న కేఎమ్ సర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. అలాగే ఈ నెల 5న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ‘ఐరా’ టీజర్‌ను ఔరా అనిపించేలా చిత్రబృందం కట్ చేశారని కోలీవుడ్ టాక్.
ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్ కూడా ఔరా అనేలానే ఉందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో విజయ్ హీరోగా రూపొందనున్న సినిమాలో, శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె కథానాయిక. ఇంకా ఆమె చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... డిసెంబర్ 28కి ఇండస్ట్రీలో 15ఏళ్లను పూర్తి చేసుకున్నారు నయన. నటిగా ఆమె వయసు 15 అన్నమాట. ఆమె నటించిన ‘మనసునక్కారే’ మలయాళ చిత్రం 2003లో డిసెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. 15 ఏళ్లయినా నయన క్రేజ్ తగ్గలేదనడానికి ఆమె చేతిలో సినిమాల లిస్టే ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment