![Nayanthara to Pair up With Chiranjeevi Again - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/29/Chirnajeevi%20Nayanthara.jpg.webp?itok=tX7tR8Y-)
రీ ఎంట్రీలో మెగాస్టార్ దూసుకుపోతున్నాడు. ఖైదీ నంబర్ 150 తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న చిరంజీవి, సైరా నరసింహారెడ్డి తరువాత మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వటం లేదు. సైరా పనులు పూర్తి కాకముందే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సైరాకు పనిచేసిన అమిత్ త్రివేథిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ విషయంలోనూ అదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సైరా సినిమాలో చిరుకు జంటగా నటించిన నయనతారనే హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment