ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. లేడీ ఒరియంటెడ్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న ఈ బ్యూటీ.. టాప్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డిలోనూ నయనతార నటించారు.
ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నటించిన నయన్ భారీ పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం నయన్‌కు ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయిలు పారితోషికంగా ఇచ్చారట. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల సరసన చేరింది నయన్.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా సినిమాను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సైరా నరిసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగా తమిళనాట విజయ్ సరసన బిగిల్, రజనీకాంత్ సరసన దర్బార్ సినిమాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment