
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా కనిపించిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ‘విన్నైతాండి వరువాయ’ పేరిట తమిళంలో విడుదలైన ఈ చిత్రంలో త్రిష, శింబులు కార్తీక్, జెస్సీలుగా నటించారు.
తాజాగా శింబు- త్రిషలపై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు గౌతమ్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిషకి కాల్ చేయడమే కథాంశం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది సన్నివేశాలుగా చూపించారు. ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వారుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఇక ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో విశేషం. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో చైతూ, సామ్‌లతో ఈ విధంగానే ఓ షార్ట్ ఫిలిం చేస్తే బాగుంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
చదవండి:
రానా నిశ్చితార్థం జరిగిపోయిందా?
సినిమాలకు సడలింపులు ఇవ్వాలి