‘కార్తీక్‌ మీ రచనలు చాలా అందంగా ఉంటాయి’ | AR Rahman to Compose Karthik Dial Seytha Yenn | Sakshi
Sakshi News home page

మరోసారి మాయ చేసిన జెస్సీ - కార్తీక్‌

Published Sat, May 16 2020 11:38 AM | Last Updated on Sat, May 16 2020 12:28 PM

AR Rahman to Compose Karthik Dial Seytha Yenn - Sakshi

నాగ చైతన్య, సమంత కాంబినేషనన్లో 2010లో వచ్చిన ఏ మాయ చేశావే చిత్రం ఎంతటి మాయ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జెస్సీగా సమంత కుర్రకారు మదిని దోచింది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కింది ఈ చిత్రం. తెలుగులో నాగ చైతన్య, సమంత మాయ చేస్తే.. తమిళంలో త్రిష-శింబు ప్రేక్షకుల మది దోచారు. ఈ చిత్రం పూర్తయ్యి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయి. తాజాగా గౌతమ్‌ మీనన్‌ విన్నైతాండి వరువాయకి కొనసాగింపుగా కార్తీక్‌ డయల్‌ సేత్యా యెన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రిష, శింబులు ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించగా.. స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మన్‌ దీనికి మ్యూజిక్‌ అందిస్తున్నారు.(శ్రీమతికో కేక్‌)

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు ఏవి జరగడం లేదు. దాంతో డైరక్టర్లు, రచయితలు కొత్త రచనలు చేస్తూ, షార్ట్‌ ఫిల్మ్‌లు తీస్తూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గౌతమ్‌ మీనన్‌ ఈ కార్తిక్‌ డయల్‌ సేత్యా యెన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తున్నారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. అంతేకాక ఇటీవల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.(చైతూకి 49, సమంతకు 51: సామ్‌ ట్వీట్‌!

ఈ టీజర్‌లో జెస్సీ(త్రిష), కార్తీక్‌(శింబు)ను ఉద్దేశించి ‘రాయండి.. మీ రచనలు చాలా అందంగా ఉంటాయి. అయితే బలవంతంగా ప్రయత్నించకండి. మీరొక ఆర్టిస్ట్‌.. ఏదైనా సహజంగానే జరగాలి. త్వరలోనే థియేటర్లు తెరుస్తారు.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి సంస్థలు మిమ్మల్ని కలిసి తమ కోసం పని చేయమని కోరతాయి. వారికి కావాల్సింది మంచి రచనలు మాత్రమే. త్వరలోనే అంతా సర్టుకుంటుంది’  అంటూ సాగిన టీజర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

విన్నైతాండి వరువాయి చిత్రంలో కార్తీక్‌ ఓ రచయిత అనే సంగతి తెలిసిందే. దాంతో లాక్‌డౌన్‌ గురించి చింతించకుండా కథలు రాయమని జెస్సీ, కార్తీక్‌ను ప్రేరేపిస్తుంది. అయితే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం త్రిష, శింబుల పాత్రలను వారి ఇళ్లలోనే షూట్‌ చేశారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ విడదల తేదీని ఇంకా ప్రకటించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement