
కరోనా లాక్‌డౌన్‌తో సినీ సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ అనూహ్యంగా దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమానులు తెరపై మిస్సవుతున్న వినోదాన్ని సోషల్ మీడియా వేదికగా పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వినోదాత్మకమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూనే.. తమ ఫ్యాన్స్‌కు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్(ఫోటో) ఫోటోస్ హవా నడుస్తోంది. దీంతో కొందరు సెలబ్రెటీలు తమకు సంబంధించిన పాత ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే సమంత అక్కినేని తాజాగా పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. సమంత, ఆమె భర్త నాగ చైతన్య, తమ పెంపుడు కుక్క హ్యాష్‌తో కలిసి కారులో కూర్చున్న ఓ పాత ఫోటోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా `దాదాపు ఓ గొప్ప సాహసయాత్రకు సిద్దమవుతున్నాం` అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటోకు కేవలం గంటల వ్యవధిలోనే వన్ మిలియన్ లైక్స్ రాబట్టడం విశేషం. ఇక ప్రస్తుతం నాగచైతన్య `లవ్‌స్టోరీ` చిత్రంతో బిజీగా ఉన్నారు.
చదవండి:
దిల్ వాకిట్లో తేజస్విని
దేవిశ్రీ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్‌కు పండగే
Comments
Please login to add a commentAdd a comment