
ప్రముఖ యూట్యూబర్, మై విలేజ్ షో ఫేమ్ అనిల్ అందరికీ సుపరిచితమే.

గతంలో తన వెడ్డింగ్ కార్డ్‌ను కరోనా టైమ్‌లో వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ జీల అనిల్ మై విలేజ్ షో తోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా తన భార్యతో కలిసి చండీ హోమం నిర్వహించారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.









