గుండెను హత్తుకునే ఆ డైలాగులు రెండు నెలలుగా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. కేవలం15 నిమిషాల నిడివితో నిర్మించిన ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును సైతం ఊపేస్తోంది.
హిమాయత్‌నగర్:హృదయానికి హత్తుకునే ఈ డైలాగులు రెండు నెలలుగా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ డైలాగులు ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్‌లోవి. కేవలం 15నిమిషాల నిడివిగల ఈ షార్ట్‌ఫిల్మ్ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును సైతం ఊపేస్తుంది. ‘చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలం’ వంటి కాలాల్లో ప్రేమలో సూర్య (సూర్యుడు) ఎదుర్కొనే పరిణామాలను డైరెక్టర్ దీపక్ ఎంతో అందంగా చిత్రీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో 70కి పైగా అవార్డులను కైవసం చేసుకుని తెలుగు, తమిళ నటీ నటులను సైతం ఆకర్షించిన ‘మనసానమః’ షార్ట్‌ఫిల్మ్‌పై ప్రత్యేక కథనం.
మనసానమః మూవీ మనసుకు చాలా నచ్చింది. చాలా ప్రత్యేకమైన మూవీ కూడా. డైరె క్టర్ దీపక్ చాలా తెలివిగా ఆకట్టుకునేలా తీశారు. చాలా అద్భుతంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వారికి కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా’.– ఇన్‌స్ట్రాగామ్‌లో అగ్రనటి అనుష్క
‘ఇదొక అందమైన చిత్రం. ఈ చిత్రం చూశాక మనసంతా చాలా ఆనందంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. సినిమాలో యాక్ట్ చేసిన వారందరికీ, డైరెక్టర్ దీపక్‌కు బెస్ట్ ఆఫ్ లక్’. – ట్విట్టర్‌లో రష్మిక మందాన.
హైటెక్‌సిటీకి చెందిన దీపక్ యూఎస్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి దీపక్‌కు సినిమాపై ఆసక్తి ఉంది. తొలిసారిగా 2013లో ‘డబ్ల్యూటీఎఫ్’(వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్) పేరుతో థ్రిల్లర్ షార్ట్‌ఫిల్మ్ తీశారు. 2015లో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అనే పేరుతో కామెడీ, 2016లో ‘హైడెన్ సీక్’(హారర్) షార్ట్ ఫిల్మ్‌లను ఆయన నిర్మించారు. ఈ మూడు షార్ట్‌ఫిల్మ్‌లకు నెటిజన్ల నుంచే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా.. 2017లో ‘వీకెండ్ సినిమా’ అనే పేరుతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించారు. దీంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్మించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘ఫిదా’కు యూఎస్ షెడ్యూల్ 40రోజులకు దీపక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మరింత మందికి దీపక్ చేరువయ్యారు.
మనసుకు హత్తుకున్న ‘మనసానమః’
‘చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలం’ వంటి కాలాల్లో సూర్యుడు ఏ విధంగా వాతావరణానికి రియాక్ట్ అవుతాడో.. ఆ విధంగా నిజజీవితంలో సూర్య అనే వ్యక్తి ముగ్గురు అమ్మాయిల మధ్య మూడు సీజన్స్‌లలో రియాక్ట్ అయ్యే విధానాన్ని దీపక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చూపించారు. సూర్యగా హీరో విరాజ్ అశ్విన్, హీరోయిన్లుగా దృషిక చందర్(చైత్ర, చైత్రకాలం), శ్రీవల్లి రాఘవేందర్(వర్ష, వర్షాకాలం), పృథ్వీశర్మ (సీత, శీతాకాలం)లు నటించారు.
క్లోజ్ సర్కిల్ కథల ఆధారంగా..
నా చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ కథల ఆధారంగా ‘మనసానమః’ షార్ట్‌ఫిల్మ్ నిర్మించా. గతంలో నేను చేసిన మూడు షార్ట్‌ఫిల్మ్‌లను బట్టి నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఈ ఫిల్మ్ చిన్నా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటుంది. మనదగ్గరే కాదు తమిళనాడు, బాలీవుడ్‌లో సైతం ఈ సినిమా హైలెట్‌గా నిలవడం ఆనందంగా ఉంది. – దీపక్, మనసానమః డైరెక్టర్.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్ ఫిల్మ్‌గా ‘మనసానమః’ నిలిచింది. ‘ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ మ్యూజిక్ ఫిల్మ్ ఫేస్టి వల్’(క్రాషియా)కు ఈ సినిమా ఎంపి కైంది. ప్రపంచ వ్యాప్తంగా 15 షార్ట్ ఫిల్మ్‌లు ఎంపికవ్వగా.. వాటిలోమనసానమః నిలిచింది. ‘టాప్ షార్ట్స్(కాలిఫోర్నియా), ఇండిపెండెంట్ షార్ట్స్ అవార్డ్స్(హాలివుడ్, లాస్ ఏంజెల్స్), ఇండియే షార్ట్ ఫెస్ట్ (హాలివుడ్, లాస్ ఏంజెల్స్) ఇలా 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment