
నిందితుడు షణ్ముఖ వినయ్
గచ్చిబౌలి: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని నమ్మించి షార్ట్‌ఫిలింలో సినిమాటోగ్రాఫర్‌గా పని చేసే వ్యక్తి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌సుందర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్టణం, సీతమ్మధార ప్రాంతానికి చెందిన సిరిగుడి షణ్ముఖ వినయ్ నగరానికి వలస వచ్చి మాదాపూర్‌లోని మస్తాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. బీటెక్ చదివిన అతను కొంత కాలంగా షార్ట్‌ఫిల్Šస్‌లో సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితుడు మహబూబ్ గత జనవరిలో సైడ్ డ్యాన్స్ చేసేందుకు యువతులు కావాలని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు.
దీనిపై స్పందించిన బోడుప్పల్‌కు చెందిన ఓ యువతి చర్లపల్లిలో మహబూబ్‌ను కలిసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న షణ్ముఖ వినయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. సినిమా ఆర్టిస్టులను పరిచయం చేస్తానని నమ్మించి ఆమెను అమీర్‌పేట్‌కు రప్పించాడు. అక్కడి నుంచి బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకుని మాదాపూర్ జైహింద్ ఎన్‌క్లేవ్‌లోని గోల్డెన్ గేట్ టవర్స్‌లోని గదికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజులు సదరు యువతితో ఫోన్లో మాట్లాడిన షణ్ముఖ వినయ్ ఆమె ఎస్సీ కావడంతో నిన్ను పెళ్లి చేసుకునేందుకు తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని తెలిపాడు. దీంతో నాలుగు రోజుల క్రితం మాదాపూర్ వచ్చిన బాధితురాలు అతడిని నిలదీయగా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు ఈ నెల 11న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాన పోలీసులు గురువారం నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment