![Actor Brahmaji Acts Without Remuneration In Hangman Short Film - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/31/han.jpg.webp?itok=yv8Vbdpn)
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేక పేరు సంపాదించారు. అలాగే ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. అదే విహాన్ తెరకెక్కించిన 'హ‍్యాంగ్ మాన్' లో తలారి పాత్ర పోషించారు. ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసే వ్యక్తిని తలారి అంటారు.
ఇది ఒక చిన్న సినిమా అయినా ఒక తలారి జీవితం ఎలా ఉంటుంది? అతను ఉరి తీసేటప్పుడు మానసికంగా ఎలా సిద్దమవుతాడు? అనే విషయాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ తన కుమారునికి కొడుక్కి కూడా తలారి పని ఎలా చేస్తారో కూడా వివరిస్తుంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఈమధ్య హైదరాబాద్‌లోని ప్రివ్యూ థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమాలో బ్రహ్మజీ నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తలారి పాత్రను అద్భుతంగా చేసి అందులో ఇమిడిపోయాడు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే ఈ సినిమా కథ నచ్చి.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment