సాక్షి, హైదరాబాద్: ఆరీ్టసీని జనానికి చేరువ చేసేందుకు నానా పాట్లు పడుతున్న అధికా రు లు తాజాగా షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ఆకట్టుకోవా లని నిర్ణయించారు. ఈమేరకు షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మెరుగ్గా ఉన్న వాటి ల్లోంచి ఎంపిక చేసిన మొదటి ఫిల్మ్‌కు రూ.10 వేలు, రెండో ఫిల్మ్‌కు రూ.5 వేలు, మూడో ఫిల్మ్‌కు రూ.రెండున్నర వేలు పురస్కారం ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
సురక్షితమైన ప్రయాణం, లీటరు పెట్రోలు ధర కంటే తక్కువ మొత్తంతో రోజంతా నగరంలో సిటీ బస్సుల్లో తిరిగే అవకాశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు వంటి తదితర అంశాలు ఇతివృత్తాలుగా షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని అందులో పేర్కొన్నారు. ఉత్సాహం ఉన్న వారు వివరాలతో ఈనెల 21 లోపు tsrtcshortfilm@gmail.com చిరునామాకు ఎంట్రీలు పంపాలని సూచించారు.