బన్నీ మెచ్చిన షార్ట్‌ ఫిల్మ్‌ | Allu Arjun Likes Shravan Kumar Short Film | Sakshi
Sakshi News home page

బన్నీ మెచ్చిన షార్ట్‌ ఫిల్మ్‌

Published Mon, Mar 2 2020 8:10 AM | Last Updated on Mon, Mar 2 2020 8:10 AM

Allu Arjun Likes Shravan Kumar Short Film - Sakshi

షార్ట్‌ ఫిల్మ్‌ చూస్తున్న అల్లు అర్జున్‌

రామగిరి: నాగేపల్లికి చెందిన విష్ణుభక్తుల శ్రవణ్‌కుమార్‌(శ్రవణ్‌ ఆర్య) సొంత ఆలోచనతో తీసిన షార్ట్‌ ఫిల్మ్‌ తెలుగు సినీ హీరో అల్లు అర్జున్‌ను ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌పై  ఉన్నటువంటి అభిమానంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యతో మాస్‌ క బాప్‌ క్లాక్‌ క టాప్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీసినట్లు శ్రవణ్‌ తెలిపాడు. విష్ణుభక్తుల ప్రొడక్షన్‌ ద్వారా నిర్మించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు రైటర్‌గా హరీశ్‌కుమార్, దర్శకుడిగా రఘు జంగిలి,  కో–ప్రొడ్యూసర్‌ డార్లింగ్‌ మధు, డీవోపీ జనతా బబ్బుల, హీరోగా శ్రవణ్‌ కుమార్‌ నటించాడు. షార్ట్‌ ఫిల్మ్‌ గురించి తెలుసున్న అల్లు అర్జున్‌.. శ్రవణ్‌ కుమార్‌ను పిలుపించుకుని షార్ట్‌ ఫిల్మ్‌ను అతడి మొబైల్‌లో చూసి అభినందించాడు.(బుట్టబొమ్మ వీడియో సాంగ్‌ వచ్చేసింది)


శ్రవణ్‌కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement