కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక చిన్నారి చిత్రకారుడిని స్ఫూర్తినిస్తూ ప్రోత్సహించారు. విద్యార్థులకు, ప్రతిభావంతులకు సాయం చేయడంలోనూ, ప్రోత్సహించడంలోనూ నటుడు సూర్య ముందుంటారు. తాజాగా ఒక చిన్నారి చిత్రకారుడి కలను నిజం చేస్తూ అతనిలో మరింత స్ఫూర్తిని నింపారు. వివరాలు చూస్తే.. తేని గ్రామానికి చెందిన దినేశ్ అనే బాలుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తన సమస్యను జయించి మంచి చిత్రకారుడిగా రాణిస్తున్నాడు.
చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన కుర్రాడికి నటుడు సూర్యను కలవాలన్నది చిరకాల కల అట. ఇదే విషయాన్ని దినేశ్ ఒక టీవీ చానల్ భేటీలో పేర్కొన్నాడు. అది సూర్య అభిమానుల దృష్టికి రాగా వారు దినేశ్‌ను తన కుటుంబసభ్యులు సహా బుధవారం చెన్నైలోని సూర్య ఇంటికి ఆయన ఆదేశాల మేరకు తీసుకొచ్చారు.
దినేశ్ లక్కేమిటంటే తను నటుడు సూర్యను కలవాలని కలలు కన్నాడు. ఇప్పుడు ఏకంగా సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ, వారి తండ్రి సీనియర్ నటుడు శివకుమార్‌లను ఒకే చోట చూసే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నటుడు సూర్య ఆ కుర్రాడికి కలలు కను. వాటిని సాధిస్తాననే నమ్మకం కలిగుండాలి. ఇప్పుడు నన్ను కలవాలని కలలు కన్నావు. అది నెరవేరిందిగా అంటూ దినేశ్‌లో స్ఫూర్తిని నింపారు. అంతే కాదు అతనికి పలు కానుకలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment