ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి! | CID actor Dinesh Phadnis passes away - Sakshi
Sakshi News home page

Dinesh Phadnis: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!

Dec 5 2023 11:51 AM | Updated on Dec 5 2023 12:14 PM

Dinesh Phadnis Fredericks of CID actor passes away - Sakshi

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీఐడీ షో ద్వారా పాపులర్‌ అయిన దినేశ్‌ ఫడ్నీస్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సహనటుడు దయానంద్ శెట్టి వెల్లడించారు. దినేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు బోరివలి తూర్పులోని దౌలత్ నగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

కాగా దినేశ్‌.. సీఐడీ షోలో ఫ్రెడరిక్స్‌ అనే పాత్రను పోషించాడు. 20 ఏళ్లపాటు ఈ షోలో భాగమయ్యాడు. 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే! సీఐడీతో పాటు హిట్‌ సీరియల్‌ తారక్‌ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్‌లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్‌. సర్ఫరోష్‌, సూపర్‌ 30 సహా పలు హిందీ చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement