
ప్రముఖ హిందీ నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందాడు. ముంబైలోని గురువారం తన అపార్ట్‌మెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇతడు తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఫ్రెండ్స్ సుదీప్ సాహిర్, విభూతి ఠాకుర్ ధ్రువీకరించారు. తన స్నేహితుడి తమని వదిలేసి వెళ్లిపోవడంపై సంతాపం తెలియజేశారు.
(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)
ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కి చెందిన నితిన్ చౌహాన్.. ముంబైలో నటుడిగి నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే స్ప్లిట్స్ విల్లా 5, జిందకీ డాట్ కామ్, క్రైమ్ పాట్రోల్ లాంటి రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు. రెండేళ్ల క్రితం చివరగా 'తేరే యాన్ హూన్ మై' అనే సీరియల్‌లో నటించాడు.
స్వతహాగా ఫిట్‌నెస్ ఫ్రీక్, నెమ్మదస్తుడు అయిన నితిన్.. ఇలా చనిపోయిన విషయాన్ని తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ఇంత చిన్నవయసులోనే ప్రాణాలు తీసేసుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment