Frederick
-
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీఐడీ షో ద్వారా పాపులర్ అయిన దినేశ్ ఫడ్నీస్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సహనటుడు దయానంద్ శెట్టి వెల్లడించారు. దినేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు బోరివలి తూర్పులోని దౌలత్ నగర్లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా దినేశ్.. సీఐడీ షోలో ఫ్రెడరిక్స్ అనే పాత్రను పోషించాడు. 20 ఏళ్లపాటు ఈ షోలో భాగమయ్యాడు. 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే! సీఐడీతో పాటు హిట్ సీరియల్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్. సర్ఫరోష్, సూపర్ 30 సహా పలు హిందీ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. -
గోవులమ్మ
ఒక ప్రయాణం జీవిత గమనాన్నే మార్చేయవచ్చు. ఈ మాట ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ విషయంలో నిజమైంది. నాలుగు దశాబ్దాల క్రితం జర్మనీ నుంచి ఇండియా వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయారు బ్రూనింగ్. అందుకు కారణం.. ఆవులపై ఆమెకు కలిగిన ప్రేమ, ఆపేక్ష! ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్కి ఇప్పుడు 59 ఏళ్లు. ఆమె నలభై ఏళ్ల కిందట.. 1978లో భారతదేశంలో పర్యటించారు. తండ్రి ఇండియాలో ఉన్న జర్మనీ రాయబార కార్యాలయంలో ఉద్యోగి కావడం కూడా ఆమె ఇండియా రావడానికి ఒక కారణం. ఆ పర్యటనలో ఆమె రాధాకుండ్, మధుర వగైరా ప్రదేశాలను చూశారు. మధురలోనే ఉండిపోయారు. ఆ ప్రయాణం ఆమెను ఆవులకు దగ్గర చేసింది. వాళ్ల పొరుగింటావిడ ఆవు మీద చూపిస్తున్న ప్రేమకు కదిలిపోయారు బ్రూనింగ్. తాను కూడా ఒక ఆవుని తెచ్చుకున్నారు. ఆవులను ఎలా పెంచాలో పక్కింటామె నేర్పించింది. ఇంకా తెలుసుకోవడానికి ఇంగ్లిష్, జర్మన్ భాషల్లో ఉన్న పుస్తకాలను కొన్నారు బ్రూనింగ్. ఒక్క ఆవుతో సంరక్షణ మొదలుపెట్టిన బ్రూనింగ్ దగ్గర ఇప్పుడు దూడలు, కోడెలతో కలిపి మొత్తం పన్నెండు వందల వరకు ఆవులున్నాయి. ఆ ఆవులే ఆమెకి లోకం. వాటికి గ్రాసం పెట్టి శుభ్రం చేయడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న వాటికి మందులు వేయడానికి మొత్తం అరవై మంది వరకు పనివాళ్లున్నారు. నెలకు ఖర్చు ఇరవై లక్షలు దాటుతోంది. పాలిచ్చే దశ దాటిన ముసలి ఆవులను, కాళ్లు విరిగిన వాటిని, కళ్లు పోయిన వాటిని బ్రూనింగ్ నడుపుతున్న ‘సురభి గోసేవా నికేతన్’ గోశాల ముందు వదిలి వెళ్లిపోతుంటారు స్థానికులు. వాటి బాధ్యత కూడా ఆమె ఎంతో ఆపేక్షగా స్వీకరిస్తారు. ఒకసారి బ్రూనింగ్ గోశాలలోకి అడుగుపెట్టిన ఆవు పోషణ, సంరక్షణ అంతా ఆమె స్వయంగా చూసుకుంటారు.అయితే అన్నిటికీ కలిపి నెలకు ఇరవై లక్షలు ఖర్చు చేయడం కష్టమేనంటున్నారామె. మొదట్లో తండ్రి తన జీతం నుంచి ఆమెకు కొంత డబ్బు పంపేవారు. ప్రస్తుతం బెర్లిన్‌లో తనకు ఉన్న భవనాలు, ఇతర ఆస్తుల నుంచి వచ్చే డబ్బును ఆవుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఏడాదికోసారి బెర్లిన్ వెళ్లి తండ్రిని చూసి వస్తారు బ్రూనింగ్. ప్రభుత్వం ఆమెకి కనీసం లాంగ్‌టర్మ్ వీసా కూడా ఇవ్వలేదు. నాటి నుంచీ ఏటా వీసా రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నారు! అయితే బ్రూనింగ్ డబ్బు కానీ, లాంగ్ టర్మ్ వీసా కానీ ఏమీ అడగడం లేదు. ఆవులు పెరుగుతున్నాయి, గోశాల స్థలం సరిపోవడం లేదు. కాబట్టి మరికొంత జాగా ఇస్తే... వచ్చిన ఆవులన్నింటినీ అమ్మలా సాకుతానంటున్నారు. స్థానికులు ఆమెను సుదేవీ మాతాజీ అని గౌరవిస్తున్నారు తప్ప జానెడు స్థలం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు! – మంజీర -
బయట వున్నదే లోపల వున్నది
హెర్మన్ హెస్ రాసిన ఒక జర్మన్ కథ సారాంశం ఇలా ఉంటుంది. ఒకాయన ఉంటాడు. పేరు ఫ్రెడరిక్. మేధోజీవి. ప్రతిదీ తార్కికంగా ఆలోచిస్తాడు. రెండు రెళ్లు నాలుగు అన్నంత కచ్చితంగా ఉంటాడు. ప్రతిదీ కనబడాలి. దానికి అవతల వున్నదేదీ విశ్వసించడు. ఫ్రెడరిక్ స్నేహితుడి పేరు ఇర్విన్. నిదానం మనిషి. మనిషి స్వభావాన్ని అర్థం చేసుకున్నవాడు. ఒకరోజు ఇర్విన్, బయట వున్నదే లోపల వున్నది, అని చెబుతాడు. అదెలా సాధ్యం? ఫ్రెడరిక్కు కోపమొస్తుంది. నిరూపించమని సవాల్ చేస్తాడు. ప్రతిగా ఇర్విన్ ఒక మట్టి బొమ్మ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లమంటాడు. మట్టిబొమ్మ ఏం చెప్పగలుగుతుంది? తినేముందూ, పడుకునేముందూ, బయటికి వెళ్లేప్పుడూ, వెళ్లివచ్చాకా ఫ్రెడరిక్ ఆ బొమ్మను చూస్తూనే వుంటాడు. అదేమిటో అర్థం కాదు. అది జంతువా? మనిషా? దయ్యమా? ఇంకేదైనా జీవా? బయట వున్న బొమ్మ నా లోపలికి ఎలా వస్తుంది? అంతా ఉత్తిదే, అనుకుంటాడు. కొన్నాళ్లకు ఆయన ఓ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. తిరిగి వచ్చేసరికి బొమ్మ స్థానం ఖాళీగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్లిపోయిందా ఏమిటి? ఏమైందని అడుగుతాడు. గది శుభ్రం చేసేటప్పుడు జారి పగిలిపోయిందని చెబుతుంది పనిమనిషి. తేలిగ్గా తీసుకుంటాడు. తెల్లారుతుంది. ఎందుకో బొమ్మ గుర్తొస్తుంది. మరిచిపోతాడు. మళ్లీ గుర్తొస్తుంది. బొమ్మతో తన ఆలోచనలు ముడిపడ్డాయి. దాని ఉనికితో తెలియకుండానే ఒక బంధం పెంచుకున్నాడు. దాంతో అది లేకపోవడం బాధిస్తుంది. మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడు. వదిలించుకునేకొద్దీ తనలో వచ్చి కూర్చుంటూనే వుంటుంది. అప్పటిగ్గానీ ఇర్విన్ చెప్పిన సత్యమేమిటో బోధపడదు. బయట వున్నదే లోపల వున్నది. ఫ్రెడరిక్లాగా ఈ సత్యాన్ని భౌతికంగా అర్థం చేయించడానికి మనకొక ఇర్విన్ దొరక్కపోవచ్చు. కానీ ఇర్విన్ చెప్పిందీ, ఇర్విన్ పాత్ర ద్వారా హెర్మన్ హెస్ చెప్పిందీ, హెస్ ఈ అవగాహనకు రావడానికి కారణమైన భారతీయ సారస్వతం చెప్పందీ ఒకటే: బహిర్గతంగా వున్నదే అంతరంగంలోనూ వున్నది. అంతరంగాన్ని జయించడమంటే ప్రపంచాన్ని జయించడమే! – పూడూరి రాజిరెడ్డి -
ట్రంప్ తాతను వెళ్లగొట్టారు!
బెర్లిన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. 1900 సంవత్సరంలో నిర్బంధ సైనిక సేవ చేసేందుకు నిరాకరించారన్న కారణంతో ట్రంప్ తాత ఫ్రెడ్రిక్‌ను జర్మనీ నుంచి బహిష్కరించారని చరిత్రకారుడు రోలాండ్ పౌల్ చెప్పినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ‘అమెరికా పౌరసత్వం తీసుకున్న ఫ్రెడ్రిక్‌కు తిరిగి జర్మనీ పౌరసత్వం ఇచ్చేది లేదని, 8 వారాల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే బహిష్కరిస్తామని 1905 నాటి స్థానిక కౌన్సిల్ జారీ చేసిన లెటర్లో పేర్కొంది’ అని పౌల్ చెప్పారంది.