కవలల అనుమానాస్పద మృతి
Published Wed, Nov 30 2016 1:56 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
బీబీపేట: ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బీబీపేట మండల కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న దినేష్, జినేష్ అనే కవలపిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement