వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి | two dies of various road accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Published Sat, Feb 18 2017 12:08 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి - Sakshi

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

పెనుకొండ/ హిందూపురం రూరల్‌ : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విద్యార్థి కాగా.. మరొకరు కర్ణాటకకు చెందిన యువకుడు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన బోయ దినేష్‌ (17) జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మహేష్‌ అనే కెమిస్ట్రీ లెక్చరర్‌ తనకు ఎంతగానో ఆప్తుడైన విద్యార్థి దినేష్‌తో కలిసి పాతచెక్‌పోస్టు సమీపంలో గల ఓ హోటల్‌కు ద్విచక్రవాహనంలో వెళ్లారు. భోజనం ముగించుకుని కళాశాల వద్దకు బయలు దేరగా రోడ్డుపైకి చేరుకునే సమయంలో అనంతపురం నుంచి పెనుకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ ప్రమాదంలో దినేష్‌ తీవ్రంగా గాయపడగా.. మహేష్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మహేష్‌ను పెనుకొండ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లిదండ్రులు తిమ్మయ్య, శారద, ఇతర బంధువుల రోదనలు ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆస్పత్రికి వచ్చి దినేష్‌ను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్‌ఐ లింగణ్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హిందూపురం రూరల్‌ మండలం కిరికెర సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలుకా బసవపురం గ్రామానికి చెందిన మురళి (32) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో శ్రీనివాసులు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని హిందూపురంలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ నారాయణ శుక్రవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement