మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి
నిజామాబాద్: ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. పార్టీ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో బుధశారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అట్టడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ఫలాలు అందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. రెండు, మూడు మండలాలకు పరిమితమైన తనకు రూరల్ టికెట్ ఇచ్చి బీజేపీ ప్రోత్సహించిందని, ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తల కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్‌లో బీజేపీకి 50వేల ఓట్లు వచ్చాయన్నారు. తనకు ఎప్పటికీ రాజకీయ గురువు మండవ వెంకటేశ్వర్‌రావు అన్నారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు జిల్లాలో శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు.
బాధ్యతల స్వీకరణ..
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు దినేశ్ కులాచారి తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ అభ్యర్థులు, జిల్లా ఇన్‌చార్జులు, ప్రభారీలు హాజరవుతారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, నాయకులు తిరుపతిరెడ్డి, నక్క రాజేశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, వినోద్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదు.. ప్రజలే తిరగబడతారు: ఎమ్మెల్సీ కవిత
Comments
Please login to add a commentAdd a comment