హీరోగానే కాదు నిర్మాణ రంగంలోనూ హవా చూపిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇప్పటికే సందేశాత్మకంగా తెరకెక్కిన 'కాకముట్టై' సినిమాతో జాతీయ అవార్డ్ సాదించిన ధనుష్, ప్రస్తుతం...
హీరోగానే కాదు నిర్మాణ రంగంలోనూ హవా చూపిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇప్పటికే సందేశాత్మకంగా తెరకెక్కిన 'కాకముట్టై' సినిమాతో జాతీయ అవార్డ్ సాదించిన ధనుష్, ప్రస్తుతం కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. తన బ్యానర్ పై రూపొందిన రెండు సినిమాలను భారీ మొత్తానికి అమ్మేసి నిర్మాతగా కూడా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు.
ధనుష్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా 'నానుమ్ రౌడీదాన్' తో పాటు, దినేష్ హీరోగా 'విసారనయ్' సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను లైకా గ్రూప్ భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. ఈ సంస్థ ద్వారానే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి. సినిమా రిలీజ్కు ముందే బిజినెస్ పూర్తి చేసేయటంతో నిర్మాతగా ధనుష్ ఫుల్ సేఫ్.
నిర్మాతగానే కాదు హీరోగా కూడా ఇదే స్పీడు చూపిస్తున్నాడు ధనుష్. ఈ తమిళ నటుడి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ధనుష్, ఆ సినిమా పూర్తవ్వగానే ఆర్. ఎస్ దురై సెంథిల్ కుమార్ సినిమాతో పాటు వెట్రిమారన్ డైరెక్షన్లో వడాచెన్నై సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.