
న్యూఢిల్లీ: గీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ దినేశ్ డాగర్ శుభారంభం చేశాడు. ఫిన్లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల 69 కేజీల విభాగం తొలి రౌండ్‌లో దినేశ్ 3–2తో 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్డస్ పెట్రాస్కాస్ (లిథువేనియా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
64 కేజీల విభాగంలో అంకిత్ ఖటానా 0–5తో ల్యూక్ మెక్‌కార్మక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు), గోవింద్ సాహ్ని (49 కేజీలు)లకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించడంతో కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.ఈ టోర్నీలో 15 దేశాల నుంచి 100 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment